Friday, January 16, 2009

అరుస్తావెందుకు ?

'కాపాడండి... రక్షించండి... నాకు ఈత రాదు...' చెరువులో మునిగిపోతూ అరుస్తున్నాడు రాజేష్.

'నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. అంత మాత్రాన పరీక్షలపుడు ఇలాగె అరిచానా' విసుగ్గా అన్నాడు ఒడ్డున ఉన్న వెంకటేష్.

ఇంకేం లేవా

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జెండాలు కొనుకుందామని వెళ్ళాడు వెంగళప్ప.

"ఏం కావాలి సార్" అడిగాడు సేల్స్ బాయ్.
"జెండాలు కావాలి"

జెండాలు తీసి ముందు పెట్టాడు సేల్స్ బాయ్.

వెంగళప్ప అన్ని తిరగేసి అన్నాడు "అన్ని ఇవే రంగులు ఉన్నాయి. వేరే రంగులు లేవా?"

అంత ఫాస్టా

ముగ్గురు కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

రవి:మా నాన్న ఎంత ఫాస్తో తెలుసా. తను బాణం వేస్తాడు. కాని ఆ బాణం చేరాల్సిన ప్లేస్ కి దానికంటే ముందుగ చేరిపోతాడు.

రాజు: మా నాన్న ఇంకా ఫాస్తు. తను వేటగాడు కదా. తుపాకి పెల్చుతాడు. బుల్లెట్ కంటే ముందుగా అక్కడికి చేరుకుంటాడు.

రమేష్: ఓస్ అంతేనా. మా నాన్న ఎంత ఫాస్తొ చెప్తే మీరసలు నమ్మలేరు తెలుసా. మా నాన్న గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తాడు. ఆఫీసు నాలుగ్గంటలకు అవుతుంది. మా నాన్న మూడున్నరకే ఇంట్లో వుంటాడు తెలుసా?

Funny Stuff

Funny & Interesting Stuff