Sunday, August 16, 2009

చీరల షాప్పింగ్

వనజ చీరలు కొనడానికి షాప్పింగ్ వెళ్ళింది. తెచ్చిన రెండో చీరనే సెలెక్ట్ చేసేయడంతో సేల్స్ మాన్ ఆశ్చర్యపోయాడు.

'అదేంటి మేడం మీరు ఇంత త్వరగా చీరను సెలెక్ట్ చేయడమా? ఇంతకు ముందేప్పుడు ఇలా జరగలేదే. కనీసం రెండు మూడు గంటలు... ఓ వంద రకలయినా చూడలికదా!' ఉండబట్టలేక అడిగేసాడు.

'ఇది మా అత్తయ్యకు లెండి. ఇప్పుడు నాకు చీరలు చూపించండి' తన సెలక్షన్ మొదలుపెట్టింది వనజ.

Monday, February 16, 2009

కోపం తగ్గడానికి

'కోపం, బాధ రెండు తగ్గటానికి మందులేమయినా ఉన్నాయా?' మెడికల్ షాప్ అతన్ని అడిగాడు రాము.

'ఇవిగో, ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికెలో మాయమవుతుంది. ఇంతకీ ఎవరికీ బిళ్ళలు?'

'ఇకేవారికి మా నాన్నకే. ఇవాళ నా ప్రొగ్రెస్స్ రిపోర్ట్ చూపించాలి' చెప్పాడు రాము.

బరువు

"ఏమే శాంత... ఈ మధ్య బరువు తగ్గాలని నెలరోజుల నుంచి గుర్రపు స్వారి చేస్తున్నావటగా? ఏమయినా తగ్గిందా బరువు?"

"అబ్బే గ్రాము కూడా తగ్గలే. కాకపోతే గుర్రం మాత్రం ఇరవై కేజీలు తగ్గింది"

పెళ్ళయిన మగవాడు

పెళ్ళయిన మగవాడు తను చేసిన తప్పుల్ని మరచిపోవాలి.

ఒకే విషయాన్ని ఇద్దరు గుర్తుంచుకోవలసిన పనేముంది?

ముందే తెలిస్తే ...

'బ్యాంకు నుంచి లోన్ తీసుకొని స్కూటరు కొనుకున్నా. వాయిదాలు సరిగా కట్టకపోయే సరికి బ్యాంకు వాళ్ళు వచ్చి స్కూటర్ తీసుకెళ్ళారు.' స్నేహితురాలితో చెప్పింది సుజాత.

'అరె ఇదేదో కాస్త ముందే తెలిస్తే బాగుండేదే. నా పెళ్ళికి లోన్ తీసుకునే దాన్ని' దిగాలుగా అంది స్నేహితురాలు.

Friday, January 16, 2009

అరుస్తావెందుకు ?

'కాపాడండి... రక్షించండి... నాకు ఈత రాదు...' చెరువులో మునిగిపోతూ అరుస్తున్నాడు రాజేష్.

'నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. అంత మాత్రాన పరీక్షలపుడు ఇలాగె అరిచానా' విసుగ్గా అన్నాడు ఒడ్డున ఉన్న వెంకటేష్.

ఇంకేం లేవా

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జెండాలు కొనుకుందామని వెళ్ళాడు వెంగళప్ప.

"ఏం కావాలి సార్" అడిగాడు సేల్స్ బాయ్.
"జెండాలు కావాలి"

జెండాలు తీసి ముందు పెట్టాడు సేల్స్ బాయ్.

వెంగళప్ప అన్ని తిరగేసి అన్నాడు "అన్ని ఇవే రంగులు ఉన్నాయి. వేరే రంగులు లేవా?"

అంత ఫాస్టా

ముగ్గురు కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

రవి:మా నాన్న ఎంత ఫాస్తో తెలుసా. తను బాణం వేస్తాడు. కాని ఆ బాణం చేరాల్సిన ప్లేస్ కి దానికంటే ముందుగ చేరిపోతాడు.

రాజు: మా నాన్న ఇంకా ఫాస్తు. తను వేటగాడు కదా. తుపాకి పెల్చుతాడు. బుల్లెట్ కంటే ముందుగా అక్కడికి చేరుకుంటాడు.

రమేష్: ఓస్ అంతేనా. మా నాన్న ఎంత ఫాస్తొ చెప్తే మీరసలు నమ్మలేరు తెలుసా. మా నాన్న గవర్నమెంట్ ఆఫీసులో పని చేస్తాడు. ఆఫీసు నాలుగ్గంటలకు అవుతుంది. మా నాన్న మూడున్నరకే ఇంట్లో వుంటాడు తెలుసా?

Funny Stuff

Funny & Interesting Stuff