వనజ చీరలు కొనడానికి షాప్పింగ్ వెళ్ళింది. తెచ్చిన రెండో చీరనే సెలెక్ట్ చేసేయడంతో సేల్స్ మాన్ ఆశ్చర్యపోయాడు.
'అదేంటి మేడం మీరు ఇంత త్వరగా చీరను సెలెక్ట్ చేయడమా? ఇంతకు ముందేప్పుడు ఇలా జరగలేదే. కనీసం రెండు మూడు గంటలు... ఓ వంద రకలయినా చూడలికదా!' ఉండబట్టలేక అడిగేసాడు.
'ఇది మా అత్తయ్యకు లెండి. ఇప్పుడు నాకు చీరలు చూపించండి' తన సెలక్షన్ మొదలుపెట్టింది వనజ.